![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-5 అనగానే ఫస్ట్ గుర్తొచ్చే రెండు పేర్లు సోహెల్, అఖిల్. వీరికి ఇప్పటికీ ఆ క్రేజ్ ఉంది. అభిజిత్, లాస్య, అవినాష్, హారిక, అరియాన, అవినాష్, మోనాల్ గజ్జర్ .. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ భారీగానే ఉంది.
బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్లలో ఇప్పటికి ఏది బెస్ట్ అంటే సీజన్-5 అని అంటారు. అంతలా ఆ సీజన్ లో కంటెస్టెంట్స్ చేసిన రచ్చ ఇప్పటికి గుర్తుంది. హౌస్ లో అరియానా, సోహెల్ కి మధ్య తరచు గొడవ జరుగుతుండేది. సోహెల్, అఖిల్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. అభిజిత్, అఖిల్ ఇద్దరు కలిసి మోనాల్ గజ్జర్ ని ఇంప్రెస్ చేయాలని చూసేవారు. అయితే ఇప్పుడు అఖిల్, సోహెల్ మాట్లాడుకోవట్లేదు. దానిగురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొంతకాలం క్రితం బిగ్ బాస్ సీజన్-5 లోని కంటెస్టెంట్స్ అందరు కలిసి ఓ ట్రిప్ వేశారు. దీనిలో భాగంగా అఖిల్ కి సోహెల్ కాల్ చేయగా.. అతను లిఫ్ట్ చేయలేదంట. ఎన్నిసార్లు చేసిన లిఫ్ట్ చేయకపోగా .. ఐ డోంట్ వాంట్ టాక్ టూ యూ అనే మెసెజ్ చేసాడంట అఖిల్ ఇదే విషయాన్ని సోహెల్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అసలేం జరిగిందని అడుగగా.. నేనైతే అందరితో మంచిగా ఉండాలనుకున్నా కానీ అఖిల్ కి స్పేస్ కావాలంటే.. మాట్లాడటం ఇష్టం లేదని చెప్పినా అడుక్కోవాలా అంటూ సోహెల్ అన్నాడు.
ఇక అఖిల్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పుడైన కలిసినప్పుడు మాట్లాడుకుంటాం కానీ సపరేట్ గా మాట్లాడుకోవడానికే కలుసుకోం అని చెప్పాడు. మనోడితో లక్కీ లక్ష్మణ్ రిలీజ్ అయినప్పుడు కూడా నువ్వేం మాట్లాడలేదని అడుగగా.. నాది నవభారతం రిలీజైంది.. ఓ షోలో చేసాను కానీ ఎవరు ఏం స్పందించలేదు. ప్రతీది మాట్లాడలని లేదు.. కానీ ఒక మెసేజ్ అయిన చేయొచ్చు కదా అని అఖిల్ అన్నాడు. సోహెల్ నీ బెస్ట్ ఫ్రెండ్ కాదా అని అడుగగా.. చాలా రోజులైంది. నాకొక పర్సనల్ స్పేస్ ఉంది. నా మెంటల్ హెల్త్ అర్థం చేసుకొని నాతో ఉండి, నన్ను కేరింగ్ గా చూసుకుంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటా.. మేమిద్దరం కలిసినప్పుడు మాములుగానే ఉంటామని మా మధ్య ఏం లేదని అఖిల్ అన్నాడు. మరి వీరిద్దరు మాట్లాడుకోకపోవడానికి అసలు కారణమేంటో తెలియాలంటే అది వాళ్ళే చెప్పాలి. ప్రస్తుతం వీరిమధ్య మాటలు లేవనే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |